కృష్ణా: కార్తీక సోమవారం సందర్భంగా మచిలీపట్నంలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ రామలింగేశ్వరస్వామిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రి రవీంద్రకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆయన వెంట జనసేన నాయకులు రాము, తదితరులు ఉన్నారు.