AP: అందెశ్రీ హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ‘అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. అందెశ్రీ రచనా ప్రస్థానం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. గొర్రెల కాపరిగా, భవన నిర్మాణ కూలీగా జీవితం మొదలుపెట్టారు. అందెశ్రీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని పేర్కొన్నారు.