KRNL: పత్తికొండకు చెందిన TTD మాజీ ఏవీఎస్వో సతీశ్ కుమార్ మృతిని హత్యగా నిర్ధారిస్తూ గుత్తి జీఆర్పీ పీఎస్లో కేసు నమోదైంది. మృతుడి బంధువుల ఫిర్యాదుతో ఎఫ్ఎఆర్ నం.75/2025గా రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. సతీశ్ కుమార్ TTD పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్నారు. ఈనెల 6న CID విచారణకు వెళ్లిన ఆయన.. నిన్న మరోసారి విచారణకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.