MNCL: జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు వేతనాలు చెల్లించాలని సోమవారం ఉదయం విధులకు హాజరు కాకుండా నిరసన వ్యక్తం చేశారు. పీఎంపీఎల్ యాజమాన్యం ఇప్పటి వరకు వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలిపారు. ప్రతి నెల వేతనాల చెల్లింపులో జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు.