KMM: రాష్ట్రంలోనే తొలిసారి ఖమ్మం జిల్లాలో ఐకేపీ సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఎర్రుపాలెం మండలం వెంకటాపురంలో ప్లాంట్ నిర్మాణానికి 4 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ ప్లాంట్ నిర్వహణ మహిళ సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్లాంట్ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారు.