BDK: దళారుల చేతిలో రైతులు మోసపోవద్దని రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం యొక్క ముఖ్య ధ్యేయమని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. టేకులపల్లి మండలం బేతంపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. రైతులను మోసం చేస్తే సహించేది లేదన్నారు.