AP: ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పలువురు మంత్రులతో మంత్రి లోకేష్ సమావేశం నిర్వహించారు. ‘తొలిసారి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలకు మంచిచెడులు తెలియట్లేదు. అవగాహన రాహిత్యంతో, అనుభవం లేక కొందరికి సమన్వయం ఉండట్లేదు. ఈనెల 14, 15 తేదీల్లో విశాఖ సదస్సును కలిసికట్టుగా విజయవంతం చేద్దాం. దీంతో లక్షలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి’ అని పేర్కొన్నారు.