SRPT: జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామ సమీపంలో రాజయ్య కుంట వ్యవసాయ బావుల వద్ద కరెంటు తీగలు కిందికి వేలాడుతున్నాయి. స్థానిక రైతులకు తగిలే విధంగా ఉండడంతో ప్రాణం అరిచేతిలో పెట్టుకొని నడుస్తున్నట్లు వాపోయారు. తక్షణమే విద్యుత్ అధికారులు చర్యలు తీసుకొని ఈ వ్యవసాయ క్షేత్రం వద్ద కరెంటు లైన్లను ఎత్తు స్తంభాలకు ఫిటింగ్ చేయాలని వేడుకుంటున్నారు.