NLG: నాగార్జునసాగర్ ఆయకట్టు, నాన్ ఆయకట్టు ప్రాంతాల్లో వరి కోతలు వేగం పుంజుకున్నాయి. ఈ వానకాలంలో సుమారు 1.26 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. ప్రస్తుతం రైతులు అకాల వర్షాలు, కూలీల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పెద్దవూర, హాలియా, నిడమనూరు మండలాల్లో కూలీల కొరత తీవ్రంగా ఉంది.