RR: పేదల కళ్లలో సొంతింటి కల నెరవేరిన ఆనందం చూస్తుంటే ఇది ప్రజా ప్రభుత్వ విజయంగా భావిస్తున్నామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్నగర్ మున్సిపాలిటీలోని 4వ వార్డులో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల కళ్లలో ఆనందం నింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.