VZM: గరివిడి బ్రిడ్జికి ఇరువైపులా ఉన్నా రక్షణ గోడలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. దీంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల పగుళ్లు రాగా.. గోడలు పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. బ్రిడ్జి మీద కొన్ని వందల వాహనాలు నిత్యం తిరుగుతూ ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరగకముందే రక్షణ గోడలను నిర్మించాలని వాహనదారులు అధికారులను కోరుతున్నారు.