NRML: తానూర్ మండలంలో పలువురు రైతులు పూల సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా వివిధ రకాల పూల తోటలు పెంపకం చేపట్టి ఆర్థిక ప్రగతి సాధిస్తున్నారు. ముఖ్యంగా బంతిపూల సాగు తక్కువ సమయంలో, తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి ఇస్తోంది. ప్రస్తుతం బంతిపూల ధర కేజీకి రూ.80 నుంచి రూ. 100 వరకు పలుకుతోంది.