HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా 226 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు హైదరాబాద్ జాయింట్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. 14వ తేదీన ఓట్ల లెక్కింపు 10 రౌండ్లలో జరుగుతుందని, ఇందుకోసం 42 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పారామిలటరీ బలగాలు మోహరించనున్నట్లు వెల్లడించారు.