AP: తిరుమల అలిపిరి మెట్లమార్గంలో మాంసాహారం కలకలం రేపింది. కొందరు టీటీడీ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు మెట్లమార్గంలో మాంసాహారం తిన్నారు. ఈ ఘటనను భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ కావడంతో పారిశుద్ధ్య కార్మికులపై టీటీడీ ఆరోగ్య విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది.