యాడెడ్ షుగర్లను తగ్గించడం వల్ల వ్యాధుల ముప్పు తగ్గడమే కాకుండా జీవన నాణ్యత మెరుగవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. చక్కెర్లను తగ్గించడం వల్ల ఏజీఈలు అనే హానికరమైన పదార్థ ఉత్పత్తి తగ్గుతుందని వివరించారు. మెదడులో భావోద్వేగాలను నియంత్రించే రసాయనాలను చక్కెర అడ్డగిస్తుంది. అందువల్ల తీపిని తగ్గిస్తే కుంగుబాటు ముప్పు తగ్గిపోతుంది.