హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన ‘రివాల్వర్ రీటా’ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రిలీజ్ డేట్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అదేరోజున ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా కూడా విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద పోటీ నెలకొంది.