NZB: జక్రాన్పల్లి మండలంలో దారుణ ఘటన జరిగింది. అర్గుల్ చెరువులో చిట్ల ప్రభాకర్ (50) అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం చేపలు పడుతుండగా గాలాలో చిక్కిన చేపను తీయబోయి నీటిలో మునిగి దుర్మరణం చెందారు. ఈ ఘటనపై మృతుడి భార్య విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి. మహేష్ సోమవారం తెలిపారు.