TG: అందెశ్రీ మృతి పట్ల పలువురు మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు సీపీఐ నేత, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంతాపం తెలిపారు. ఆయన మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు అని అన్నారు.