SRPT: తిరుమలగిరిలోని తెలంగాణ చౌరస్తా వద్ద ఆదివారం రాత్రి వీధి దీపాలు వెలగడం లేదు. సూర్యాపేట రోడ్డు వైపు లైటింగ్ వ్యవస్థ పనిచేయకపోవడంతో, నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతం చీకట్లో మునుగుతుంది. సరైన లైటింగ్ లేక ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి లైట్లు పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.