TG: ప్రముఖ రచయిత అందెశ్రీ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. అంత్యక్రియలకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేశారు. కాగా, ‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం’ పాట పాడిన అందెశ్రీ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.