AP: తెలుగు సాహిత్యాన్ని ముద్రించి భద్రపరచి, ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు సి.పి.బ్రౌన్ జయంతి సందర్భంగా మాజీ సీఎం జగన్ నివాళులర్పించారు. బ్రౌన్ తెలుగు భాషన్ ప్రేమించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన సమకూర్చిన తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు తెలుగు భాష అభివృద్ధికి శాశ్వతమైన పునాది వేసిందని తెలిపారు.