టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. హెల్లెనిక్ ఛాంపియన్షిప్ ఫైనల్లో లొరెంజో ముసెట్టిని ఓడించి తన కేరీర్లో 101వ ఏటీపీ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఇది జకోవిచ్ కెరీర్లో 72వ హార్డ్ కోర్ట్ టైటిల్. అందుకుముందు ఈ రికార్డు స్విట్జర్లాండ్‌కు చెందిన రోజర్ ఫెదరర్ (71) పేరిట ఉండేది. తాజా విజయంతో జకోవిచ్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు.