VZM: కొత్తవలస సబ్బవరం వెళ్లే రోడ్డు నూకాలమ్మ గుడి వద్ద ఆదివారం రాత్రి అంభలం పూజ ఘనంగా నిర్వహించారు. పూజకు చుట్టూ ప్రక్కల స్వాములు పెద్ద ఎత్తున వచ్చి పూజలలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వాముల పాటలతో ప్రాంగణం అంతా దద్దరిల్లింది. పూజను తిలకించడానికి స్థానికులు పాల్గొని, స్వామి అయ్యప్ప దర్శనం చేసుకొన్నారు. పూజ ఆనంతరం అయ్యప్ప స్వాములకు ప్రసాద వితరణ చేశారు.