MBNR: దేవరకద్ర మండలం చిన్న రాజమూరు గ్రామంలోని ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు 11 గంటలకు తినుబండారాలపై బహిరంగ వేలం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. లడ్డూ, పులిహోర ఇలా అనేక వాటిపై వేలం వేసే అవకాశం ఉందన్నారు. ఆసక్తి గలవారు దేవరకద్ర బ్యాంకులో లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలని అధికారులు సూచించారు. డిసెంబర్ 2 నుంచి 2026 జనవరి ఒకటో తేదీ వరకు అమ్ముకోవచ్చు అన్నారు.