NZB: డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. హైకమాండ్ నిర్ణయం వాయిదా పడటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాల వారీగా పేర్లను ఖరారు చేసినప్పటికీ, చివరి ఆమోదం కోసం వేచిచూస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆలస్యం కారణంగా జిల్లా స్థాయి పార్టీ కార్యకలాపాలు మందగిస్తున్నాయని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.