AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరును సీఎం చంద్రబాబు, సహచర మంత్రులు ప్రశంసించారు. ఆ తర్వాత ఎర్రచందన డిపో సందర్శనపై తన అనుభవాలను పవన్ పంచుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనంతో పరికరాల తయారీ ప్రతిపాదనలను పరిశీలిద్దామని సీఎం తెలిపారు. అనంతరం జనసేన కార్యాలయాలను నిబంధనల ప్రకారం నిర్మించుకోవాలని సీఎం సూచించారు.