కోనసీమ: తాగునీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామని అమలాపురం మండలం కామనగరువు బాలయోగి కాలనీకి చెందిన మహిళలు కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. కాలనీలో పైప్ లైన్లు, వీధి కుళాయిలు ఏర్పాటు చేయలేదని, దీంతో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను కోరారు.