PPM: జాతీయ న్యాయసేవల దినోత్సవం పురస్కరించుకుని కురుపాం కోర్టులో సోమవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తి సౌమ్యా మాట్లాడుతూ.. న్యాయ సేవలు గురించి ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈమేరకు న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు గ్రామాల్లో పర్యటించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈనెల 16వ తేదీ వరకు ప్రచారం చేయాలన్నారు.