MDK: తెలంగాణ సాహితీ శిఖరం, ప్రజాకవి అందెశ్రీ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను కలిగించిందని ఎంపీ రఘునందన్ రావు ‘X’ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో తన అక్షరాన్ని ఇంధనంగా మార్చి ప్రజల్లో నిత్య చైతన్యాన్ని రగిలించిన గొప్ప యోధుడు అందెశ్రీ అని కొనియాడారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.