ADB: జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై పత్తి పంట పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగు రామన్న మంగళవారం గ్రామంలో పర్యటించారు. కన్నీటి పర్యంతమైన ఆ రైతు దీపక్‌ను పరామర్శించి ఆవేదన వ్యక్తం చేశారు. స్లాట్ బుకింగ్ విధానం వల్లే రైతులకు ఈ పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు.