AP: విశాఖలో జరగనున్న CII సమ్మిట్‌పై మంత్రులతో CM చంద్రబాబు చర్చించారు. పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుపై యువతకు అవగాహన కల్పించాలని సూచించారు. సదస్సులోని చర్చలు, ఒప్పందాలను విద్యార్థులకు తెలియజేయాలన్నారు. పుట్టపర్తిని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సత్యసాయిబాబా జయంతి కార్యక్రమంలో రాష్ట్రపతి, ప్రధాని పాల్గొంటారని తెలిపారు.