JN: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశాలపై చిల్పూరు మండలం శ్రీపతిపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో రూ. 10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు ప్రారంభించారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి ఎమ్మెల్యే పెద్దపీట వేస్తున్నారని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే చర్యలు కొనసాగుతున్నాయని నేతలు తెలిపారు.