TG: HCAలో జరుగుతున్న సెలక్షన్లపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(TCA) ఫిర్యాదు చేసింది. సీఐడీ, డీజీపీ, రాచకొండ కమిషనర్‌కు ఈ ఫిర్యాదును అందజేశారు. గ్రామీణ, జిల్లా స్థాయి క్రికెటర్లకు అవకాశం కల్పించడం లేదని TCA ఆరోపించింది. క్రికెటర్ల తల్లిదండ్రులతో కలిసి ఆధారాలతో పాటు ఫిర్యాదు చేశారు. డబ్బులు తీసుకుని టాలెంట్ లేనివారికి అవకాశం ఇస్తున్నారని TCA ఫిర్యాదులో పేర్కొంది.