TG: హైదరాబాద్లో 65 ప్రాంతాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద 27 కేసులు నమోదు కాగా, ఇప్పటివరకు రూ.3.60 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. భద్రత కోసం 1,761 మంది లోకల్ పోలీసులు, 80 కంపెనీల CISF బలగాలను ఉపయోగిస్తున్నామని, 230 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశామని చెప్పారు.