కృష్ణా: పెడనలో పలుచోట్ల డ్రైనేజ్ సమస్య తీవ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు ఈరోజు ముందడుగు వేశారు. ఈ సమస్య పరిష్కారానికి అవసరమైన నిధులు CSR ఫండ్స్ ద్వారా సమీకరించేందుకు ప్రతిపాదనలు రూపొందించి ఎంపీ బాలశౌరికు పంపించారు.