ADB: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజార్షి షా అధికారులు ఆదేశించారు. ఈ మేరకు ఆయన బుధవారం క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య శాఖ, వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. పట్టణాలతో పాటు గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.