TG: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ‘నన్ను విమర్శించు.. కానీ ,హిందూవులను హేళన చేయవద్దు. ప్రధాని నరేంద్రమోదీ దృష్టిలో హిందూ, ముస్లిం తేడా ఉండదు. అందరూ భారతీయులే. ఒక సీఎం ఆర్మీ జవాన్లను కించపరచడం అవమానీయం. సైనికులకు కుల, మతాలు లేవు.. వారంతా భారతమాత బిడ్డలు అని రాహుల్ గాంధీ తెలుసుకోవాలి’ అని పేర్కొన్నారు.