తమిళ స్టార్ కమల్ హాసన్ హీరోగా సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. స్వయంగా ఆయనే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్లు అన్బిరవ్ ద్వయం ఈ చిత్రంతో దర్శకులుగా పరిచయం కానున్నారు. ఇక జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. కాగా, గతంలో కమల్ ‘విక్రమ్’ మూవీకి అన్బిరవ్ స్టంట్ కొరియోగ్రఫీ చేశారు.