తనదైన శైలిలో సినిమాలు చేస్తూ నటుడు తిరువీర్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఆయన చేసిన సినిమాల్లో ‘మసూద’, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’లు మంచి హిట్ అందుకున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు నవంబర్ నెలలోనే రిలీజ్ కావడం గమనార్హం. దీంతో తిరువీర్కి NOV నెల కలిసి వస్తోందంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.