AP: తిరుపతి జిల్లా మామండూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మామండూరు అటవీప్రాంతంలో మొక్కలు నాటారు. అనంతరం మంగళం రోడ్డులోని గోదామును పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఎర్రచందనం అక్రమ రవాణా, ఇతర అంశాలపై దృష్టి సారించారు. ఎర్రచందనం చెట్లతోపాటు.. అటవీప్రాంతంలో ఉన్న మొక్కలు, చెట్ల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు.