సత్యసాయి: టీడీపీతోనే కురబలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక గుర్తింపు లభించిందని మంత్రి సవిత తెలిపారు. శనివారం పెనుకొండలో ఆమె మాట్లాడారు. త్వరలోనే గుడికట్ల పూజారులకు గౌరవ వేతనం అందజేస్తామన్నారు. స్వయం ఉపాధి పథకాల అమలులో భాగంగా కురబలకు గొర్రెల యూనిట్లు అందజేయనున్నట్లు తెలిపారు. ఆదరణ 3.0 ద్వారా గొర్రెల సంరక్షణకు ఆధునాతన ఫెన్సింగ్, ఎల్ఈడీ లైట్లు కూడా అందజేస్తామన్నారు.