మాజీ ఉప ప్రధాని L.K. అద్వానీ పుట్టినరోజు సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వెంకయ్య ప్రత్యేకంగా ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. అద్వానీని ‘భారత రాజకీయాల్లో మహోన్నత వ్యక్తి’గా, ‘ఉక్కు మనిషి’గా కీర్తించారు. వ్యక్తిగతంగా తనకు ఆయన తండ్రి లాంటి వ్యక్తి అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఆయనకు ఆరోగ్యం చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థించారు.