NDL: రాష్ట్ర సగర వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రభుత్వం ఉప్పరి మాదన్నను నియమించింది. ఆయన పాణ్యం ఎమ్మెల్యే గారు చరితరెడ్డి వెంకటరెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. క్రమశిక్షణతో పార్టీలో నడుచుకుంటే పదవులు వాటి అంతటి అవే వస్తాయని తెలపడానికి తానే ఉదాహరణ అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు నంద్యాల జిల్లా సగర సంగం సభ్యులు అభినందనలు తెలిపారు.