కిరణ్ అబ్బవరం హీరోగా డైరెక్టర్ జైన్స్ నాని తెరకెక్కించిన చిత్రం K-ర్యాంప్. దీపావళికి విడుదలై ప్రేక్షకులను అలరించిన ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ ఆహా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 15 నుంచి K-ర్యాంప్ స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా ప్రకటించింది. కాగా రూ.18 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ రూ.26 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.