AP: అక్రమాస్తుల కేసు విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు మెమో దాఖలు చేశారు. యూరప్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఈనెల 14వ తేదీలోగా వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలని గతంలో కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ గడువు సమీపిస్తుండటంతో జగన్ తన లాయర్ ద్వారా ఈ మెమో దాఖలు చేశారు.