RR: షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధిలోని తొమ్మిదిరేకుల గ్రామంలో శనివారం తెల్లవారుజామున విద్యుత్ స్తంభాల నుంచి కరెంట్ కేబుల్ వైర్ తెగిపడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఓవర్ లోడ్ కారణంగానే కరెంట్ వైర్ తెగిపడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించాలని కోరుతున్నారు.