ELR: భక్త కనకదాసు జీవితం మనందరికీ ఆదర్శనీయమని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. ఇవాళ జిల్లా కలెక్టరేట్లో భక్త కనకదాసు జయంతి కార్యక్రమం నిర్వహించారు. భక్త కనకదాసు చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భక్త కనకదాసు విశిష్టమైన కవిగా, తత్త్వవేత్తగా, గొప్ప సామజిక సంస్కర్తగా పేరుగాంచారని కొనియాడారు.