SKLM: ఎచ్చెర్ల మండలం అజ్జరాం గ్రామంలో శివాలయంలో బ్రహ్మసూత్రం కలిగిన లింగానికి ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు వేద బ్రాహ్మణుని మంత్రాల నడుమ పంచామృతం, పళ్ళ రసాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం వేదాశీర్వాదం తీసుకున్నారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. అనంతరం తీర్ధ ప్రసాదాలను పండితులు అందజేశారు.