గబ్బా వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరగాల్సిన చివరి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. భారీ వర్షం కురవడంతో టీమిండియా ఇన్నింగ్స్లో 4.5 ఓవర్ల వద్ద మ్యాచ్ను అంపైర్లు నిలిపివేశారు. అప్పటికి భారత్ 52 రన్స్ చేసింది. కాగా 5 టీ20ల సిరీస్ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. గత 17 ఏళ్లలో ఆస్ట్రేలియాలో టీమిండియా టీ20 సిరీస్ ఓడిపోలేదు.