TG: ఈ రెండేళ్లలో ఏం చేయనందునే పాత కాంగ్రెస్ పాలన చూసి ఓటువేయాలని రేవంత్ అడుగుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. KCR నిర్మించిన సచివాలయంలోనే ఇప్పుడు రేవంత్ ఉంటున్నారని.. కేసీఆర్ నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే రేవంత్ సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అప్పుల విషయంలో సీఎం, మంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.